ఏపీ బడ్జెట్ 2019: వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ హైలైట్స్

SMTV Desk 2019-02-05 16:42:24  AP Budjet, 2019 AP Budjet,

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణడు, అమరావతి అసెంబ్లీలో తన మూడవ బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచారు, ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 11వ సారి. మంత్రి నారాయణ శాసన మండలిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కావటంతో ఇందులో ప్రజాకర్షక పథకాలకే పెద్ద పీట వేశారు, దీనిని ఎన్నికల బడ్జెట్ గా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఏపీ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ వివరాలు:

* మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2,26,177.53 కోట్లు.
* రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్లు.
* రెవెన్యూ మిగులు రూ. 2,099.47 కోట్లు.
* ఆర్థిక లోటు రూ. 32,390.68 కోట్లు.

ముఖ్యాంశాలు :

* వైద్య శాఖకు రూ. 10,032.15 కోట్లు.
* హోమ్ శాఖకు రూ. 6,397.94 కోట్లు.
* గృహ నిర్మాణ శాఖకు రూ. 4,079.10 కోట్లు.
* నీటి పారుదల శాఖకు రూ. 16,852.27 కోట్లు.
* పరిశ్రమల శాఖకు రూ. 4,114.92 కోట్లు.
* ఐటీ శాఖకు రూ. 1,006.81 కోట్లు.
* కార్మిక, ఉపాధి శాఖలకు రూ. 1,225.75 కోట్లు.
* న్యాయ శాఖకు రూ. 918.81 కోట్లు.
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 7,979.34 కోట్లు.
* మైనారిటీల సంక్షేమానికి రూ. 1,308.73 కోట్లు.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ. 35,182.61 కోట్లు.
* నిరుద్యోగ భృతిని రూ. 1,000 నుంచి రూ. 1,200కు పెంపు.
* వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
* పశుసంవర్థక, మత్స్య శాఖలకు రూ. 2030.87 కోట్లు.
* బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు
* పర్యావరణం, అటవీ శాఖలకురూ. 491.93 కోట్లు.
* ఉన్నత విద్యకు రూ. 3,171.63 కోట్లు.
* ప్రాథమిక విద్యకు రూ. 22,783.37 కోట్లు.
* పౌర సరఫరాల శాఖకు రూ. 3,763.42 కోట్లు.
* రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లు.
* స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 458.66 కోట్లు.
* సాంఘిక సంక్షేమానికి రూ. 6,861.60 కోట్లు.
* రోడ్లు, భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లు.
* స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 3,408.66 కోట్లు.
* క్రీడలు, యువజన శాఖకు రూ. 1,982.74 కోట్లు.
* ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 14,363.34 కోట్లు.
* బీసీ సబ్ ప్లాన్ కు రూ. 5,385.31 కోట్లు.
* ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమానికి రూ. 5 వేల కోట్లు.
* బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు.
* వైశ్య కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు.
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ. 10,401.05 కోట్లు.
* వికలాంగుల పెన్షన్లకు రూ. 2,133.62 కోట్లు.
* డప్పు కళాకారుల పెన్షన్లకు రూ. 108 కోట్లు.
* ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లకు రూ. 100 కోట్లు.
* రాజధాని ల్యాండ్ పూలింగ్ కు రూ. 226 కోట్లు.
* డ్రైవర్ల సాధికారత కోసం రూ. 150 కోట్లు.
* క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లు.
* ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 1000 కోట్లు.
* వ్యవసాయ ఆధునికీకరణకు రూ. 300.17 కోట్లు.
* విత్తనాభివృద్ధి నిమిత్తం రూ. 200 కోట్లు.
* ఉద్యానవన శాఖకు రూ. 124 కోట్లు.
* చంద్రన్న బీమాకు రూ. 354.02 కోట్లు.
* అన్న క్యాంటీన్ల కోసం రూ. 300 కోట్లు.
* ఎన్ఆర్ఈజీఎస్ పథకానికి రూ. 1000 కోట్లు.
* రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లకు రాష్ట్ర వాటాగా రూ. 180 కోట్లు.
* చేనేత రంగానికి రూ. 225 కోట్లు.
* ఇళ్ల స్థలాల సేకరణ నిమిత్తం రూ. 500 కోట్లు.
* చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 400 కోట్లు.
* చంద్రన్న పెళ్లి కానుక నిమిత్తం రూ. 428.47 కోట్లు.
* ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ కోసం రూ. 100 కోట్లు.
* ఇమామ్, మౌజన్ లకు రూ. 100 కోట్లు.