ఎంపిపికి ఎమ్మెల్యే వేధింపులు

SMTV Desk 2019-02-05 15:44:30  TDP, YCP, MLA Parthasarathi, MPP Padmavathi, Ananthapuram,Penukonda

అమరావతి, ఫిబ్రవరి 05: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టిడిపికి ఎదురు దెబ్బ తగిలింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రొద్దం మండలం ఎంపి పద్మావతి తన పదవికి రాజీనామా చేసారు. ఎంపిపి పద్మావతి ఎమ్మెల్యే పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు చేసారు. ఆయన ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, తమపై కక్షతో మండలం అభివృద్ధి చెందకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని పద్మావతి తెలిపారు.

తను 2017 నుంచి ఎంపీపీగా భాధ్యతలు నిర్వర్తిస్తున్నానని అయితే తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారధి కక్ష సాధింపు కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాము ఎంపిపి హోదాలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రొద్దం మండలంలో అభివృద్ధి సాధించాలేకపోయమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే పార్థసారధి అన్ని అంశాలలోను ఉద్దేశాపుర్వకంగా అడ్డుపడుతున్నాడని అన్నారు. అంతేకాకుండా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే నిధులు ఇస్తున్నారని విమర్శించారు.

తమకు నిమ్మలకిష్టప్ప మద్దతివ్వడంతో మరించ వేదింపులకు గురి చేసారని పద్మావతి తెలిపారు. పార్థసారథికి వెన్నంటే ఉంటూ టిడిపి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినప్పటికి వేధింపులకు గురి చేసారని ఆమె తెలిపారు. ఇప్పటి టిడిపి ప్రభుత్వం కన్నా గతంలో ఉన్న వైఎస్ ప్రభుత్వమే మేలని పద్మావతి అభిప్రాయపడ్డారు. అందుకే వైసిపి లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా వైసిపి కండువా కప్పుకోనున్నారు.