'చీకటి గదిలో చితక్కొట్టుడు' ట్రైలర్ కే కనెక్ట్ అయ్యారు....!

SMTV Desk 2019-02-05 15:43:43  Chikati Gadilo Chitha Kotudu, Telugu Movie, Teaser, Trailer, Director Santhosh P. Jayakumar, Adith Arun, Nikki Tamboli, Bhagyashree Mote, Mirchi Hemanth , Iruttu Arayil Murattu Kuthu

హైదరాబాద్, ఫిబ్రవరి 05: పూర్తి అడల్ట్ కంటెంట్ తో తమిళ దర్శకుడు సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు . ఈ సినిమాలో అదిత్ అరుణ్, నిక్కి టంబోలి, భాగ్యశ్రీ మోతే, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఇరుత్తు అరయిల్ మురత్తు కుత్తు కి రీమేక్ గా తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. పూర్తి అడల్ట్ కంటెంట్ తో ట్రైలర్ ఉండడంతో ఆ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.

ట్రైలర్ లో బూతు కంటెంట్ ఓ రేంజ్ లో ఉండడంతో జనాలు తెగ చూస్తున్నారు. ఎంతగా అంటే రెండు రోజుల్లో ఈ చిన్న సినిమా ట్రైలర్ కి మూడు మిలియన్ల వ్యూస్ ని రాబట్టింది. బూతు కంటెంట్ ఎక్కువగా ఉందని కామెంట్స్ వేస్తున్నా.. ట్రైలర్ ని మాత్రం బాగానే చూస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన ఏడు చేపల కథ సినిమా ట్రైలర్ కూడా ఇలానే అడల్ట్ కంటెంట్ తో వ్యూస్ తెచ్చుకుంది. ఈ వ్యూస్ సినిమా ఓపెనింగ్స్ పై ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో చూడాలి!