కన్నడ బ్యూటిపై మాటల మాంత్రికుడి కన్ను....

SMTV Desk 2019-02-05 15:31:03  Rashmika mandanna, Trivikram srinivas, Allu arjun, Chalo movie, Devadas movie, Geetha govindam movie

హైదరాబాద్, ఫిబ్రవరి 05: ఛలో , గీత గోవిందం , దేవదాసు వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటి రష్మిక మందన్నా. ఈ బ్యూటిపై టాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా ఆసక్తి చూపుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కూడా ఈ అమ్మడుపై మనసు పడ్డాడట. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుందామని త్రివిక్రమ్ అంటున్నారట. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ ఎక్కువగా దొరకకపోవడంతో మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో త్రివిక్రమ్ రష్మికని రికమెండ్ చేస్తున్నాడట. బన్నీ పక్కన హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేస్తారని అంటున్నారు. అదే గనుక జరిగితే రష్మిక కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తోంది.