తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న కుళ్ళు తో ఇంటికి నిప్పంటించిన అన్న

SMTV Desk 2019-02-05 15:25:35  Makhan Mondal, Govindha, Vikas, House Fire

కొలకత్తా, ఫిబ్రవరి 5: మన కుటుంభం లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషిస్తాం. ఒకరి కాకపోతే మరోకరన్న కుటుంబనికి అండగా ఉంటారని దైర్యం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి. తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం వచిందని కోపం తో హత్యా చేసాడు అన్న. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లా మానిక్‌చక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలిసుల కథనం ప్రకారం... మఖాన్ మోందల్, గోవిందా(28), వికాశ్(32) అన్నదమ్ములు. వీరు తన తల్లితో తో కలిసి ఉంటున్నారు. కారుణ్య నియామకాల్లో భాగంగా ఇటీవల గోవిందాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్నీ జీర్ణించుకోలేక మఖాన్ మోందల్ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పెట్రోలు పోసి వారు ఉంటున్న ఇంటికి నిప్పంచారు.

ఈ ఘటనలో తమ్ముడు గోవిందా, అతడి ఇద్దరు కుమార్తెలు, అన్న వికాశ్ సజీవ దహనమయ్యారు. వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె, గోవిందా భార్య మల్దా మెడికల్ కళాశాలలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయం లో తన తల్లి వేరే రూమ్ లో నిద్రించగా, తన భార్య పుట్టింటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడగలిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.