మైక్రో మాక్స్‌ సెల్ఫీ స్మార్ట్‌ ఫోన్‌

SMTV Desk 2017-08-01 18:58:55  Micromax selfie 2, Micromax replacement smartphone, Micromax 4g phone

ముంబై, ఆగష్టు 1: ప్రస్తుతం సెల్పీ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో మైక్రో మాక్స్‌ మరో మొబైల్‌‌ని సెల్ఫీ2 అనే పేరుతో నేటి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆఫ్‌లైన్‌లో మాత్రమే విక్రయించనున్నసెల్ఫీ2 స్మార్ట్‌ ఫోన్‌ అన్ని ప్రధాన పట్టణాల్లోని రిటైల్‌ విక్రయశాలల్లో లభ్యంకానుంది. ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉన్న మెటాలిక్‌ బాడీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999. వినియోగదారులకు మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 100 రోజుల రీ ప్లేస్‌మెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల్లోగా ఎలాంటి నష్టం కలిగినా కొత్త ఫోన్‌ లేదా దాని ధరకు సమానమైన మరో ఫోన్‌ను ఇవ్వడంతో పాటు ఏడాది వారెంటీని అందిస్తోంది. ఇక, ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 250 గంటల స్టాండ్‌ బై టైమ్‌,5.2 అంగుళాల టచ్ స్క్రీన్,3జీబీ ర్యామ్‌,1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 13 మెగాపిక్సెల్‌ వెనుక, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాలను కలిగి, ఆండ్రాయిడ్‌ నూగట్‌ 7.0 ఓఎస్‌ తో వస్తుంది ఈ 4జీ ఫోన్.