ఏపీ బడ్జెట్ లో రాష్ట్ర నిరుద్యోగులకు వరాల జల్లు

SMTV Desk 2019-02-05 13:35:45  Andhrapradesh Budget 2019, Andhrapradesh Assembly, Finance minister, Yanamala ramakrishnudu, Otan account budget, Students, Unemployment

అమరావతి, ఫిబ్రవరి 5: మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. నేడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉన్నదానిని రూ.2వేలుగా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

ఇక నుంచి నిరుద్యోగులకు ప్రతి నెలా.. రూ.2వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చేసిన హామీ ప్రధాన కారణమని చెప్పొచ్చు. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇదే నిరుద్యోగ భృతిని అస్త్రంగా వాడుతున్నట్లు తెలుస్తోంది.