లోక్ సభ ఎన్నికలలో పోటి చేయనున్న సుమలత

SMTV Desk 2019-02-05 13:30:21  Sumalatha Ambarish, Kumaraswamy, Nikhil Gouda, JDS, Congress

బెంగళూరు, ఫిబ్రవరి 5: ప్రముఖ సిని నటి సుమలత రాజకీయాల్లోకి రానున్నరంటు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఆ వార్తలు నిజామవబోతున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికలలో కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు తెలిపారు.

మండ్య లోక్ సభ నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు సుమలత అంబరీష్ రాజకియలోకి రానున్నట్టు సమాచారం. గతంలో ఈ నియోజకవర్గం నుండి హీరోయిన్ రమ్య పోటి చేశారు. ఈ నియోజకవర్గం నుండి సుమలత పోటి చేస్తే కన్నడ సిని పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సుమలత రాజకియలోకి రావాలని చాలా మంది ఒత్తిడి చేశారట. అందుకే ఆమె కూడా పోటికి ఒప్పుకున్నారు. ఈ విషయంపై ఫిబ్రవరి 11వ తేదీన అధికారిక ప్రకటన చేయనున్నారు.ఇదిలా ఉండగా ఇదే నియోజకవర్గం నుండి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మండ్య నియోజకవర్గంలో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కచ్చితంగా పోటి చేయనున్నట్టు జేడీఎస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో ఉన్నాయి కాబట్టి సుమలత టికెట్ కాన్ఫామ్ అయితే నిఖిల్ గౌడ తప్పుకోవాల్సిందే అని పలువురు భావిస్తున్నారు.