2019 ఏపీ బడ్జెట్ : బీసీల కోసం 28800 కోట్లు

SMTV Desk 2019-02-05 13:14:29  Andhrapradesh Budget 2019, Andhrapradesh Assembly, Finance minister, Yanamala ramakrishnudu, Otan account budget

అమరావతి, ఫిబ్రవరి 5: నేడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన తరగతులకు కార్పోరేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. 28800 కోట్లను బీసీల కోసం ఖర్చు చేసినట్టుగా యనమల తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందులో వెనుకబడిన తరగతుల కార్పోరేషన్లకు రూ. 3 వేల కోట్లను కేటాయించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదే సమయంలో అన్ని బీసీ కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. యాదవ, తూర్పు కాపు, గాజుల కాపు, కొప్పుల వెలమ, తొలినాటి వెలమ, కురబ, కురుమ, మన్యకుల క్షత్రియ, వన్నిరెడ్డి, వని కాపు, పల్లికాపు, పల్లిరెడ్డి, కళింగ, గవర, చేనేత, పద్మశాలి, దేవాంగ, తొగట, సాలీ, వీరక్షత్రియ, పట్టు సాలీ, తొగట సాలీ, సేనాపతులు, మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరీ, గంగపుత్ర, గొండ్ల తదితర కులాలకు కొత్త కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్టు యనమల ప్రకటించారు.

రజక, సాగర, నాయి బ్రహ్మణ, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకి, బోయ, భట్రాజు, కుమ్మరి, శాలివాహనులకు ఉన్న కోఆపరేటివ్ పెడరేషన్లను కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్లుగా మార్చుతున్నట్టుగా ఏపీ సర్కార్ ప్రకటించింది. కల్లుగీత కార్పోరేషన్, శెట్టిబలిజ, గౌడ, గౌడ్, ఈడిగ, గండ్ల, శ్రీశయన, కలింగ కార్పోరేషన్లను కూడ ఫైనాన్స్ కార్పోరేషన్లుగా మార్చనున్నామని యనమల ప్రకటించారు. వెనుకబడిన తరగతుల కార్పోరేషన్లకు రూ.3 వేల కోట్లను కేటాయించనున్నట్టు యనమల స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 2014లో బ్రహ్మణ, 2015లో కాపు కార్పోరేషన్, 2016లో, ఆర్యవైశ్య, అత్యంత వెనుకబడిన కార్పోరేషన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2018లో దూదేకుల కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు, బ్రహ్మణుల సంక్షేమానికి వంద కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు.