ఆ ఇద్దరూ రాష్ట్రానికి ప్రమాదమే: కేఏ పాల్

SMTV Desk 2019-02-05 12:35:38  KA Paul,Pawan Kalyan, Chandrababu, Jagan, YSR, Janasena, Prajashanthi, Andrapradesh, Telangana, elections

అమరావతి, ఫిబ్రవరి 5: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం ఖమ్మంలో ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీని అధికారం లోకి తెస్తే మునుపెన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి బూజును దులిపెస్తామన్నారు. చాల దేశాలకు ప్రెసిడెంట్లను నియమించిన అనుభవం తనకుందని తెలిపారు.

అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు జగన్ వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాడని, ఇప్పుడు మళ్ళి అధికారంలోకి వచ్చి ఇంకా దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు కూడా బినామీ పేర్లతో ఆస్తులు కూడగట్టుకున్నారనీ అన్నారు. వీరిద్దరి వాళ్ళ రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందే తప్ప తగ్గదని తెలిపారు. ఆ ఇద్దరు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రమాదమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి పోటీ చేయాలనీ పాల్ కోరారు.

రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ లోను పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రి తానేనని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేసారు.