శిఖా చౌదరి పాత్రపై ఇంకా వీడని అనుమానాలు

SMTV Desk 2019-02-05 11:49:16  Jayaram murder case, Shikha Choudary, Rakesh reddy

విజయవాడ, ఫిబ్రవరి 5: ఎక్ష్ప్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురిపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దీనికి సంభందించిన స్పష్టమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. నిందితుడు రాకేశ్ తానే జయరాం ని హత్య చేసానని ఒప్పుకున్నాడు. అయితే ఈ హత్య కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్ర పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తనకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలోనే హత్య జరిగిందని రాకేశ్ వెల్లడించాడు. కానీ ఆ అప్పు జయరాం మేనకోడలు శిఖా తీసుకుంది. అంతేకాకుండా హత్య జరిగిన రోజు రాత్రి శిఖా జయరాం ఇంటికి వెళ్లి ఇంటి తాళం ఇవ్వమంటూ వాచ్ మెన్ పై దౌర్జన్యం చేయడంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే శిఖా చౌదరీని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది.

ఈ హత్యలో ప్రధాన నిందితుడు రాకేశ్ అని నిర్దారణ అయినప్పటికీ శిఖా చౌదరి పాత్ర పై ఇంకా అనుమానాలు ఉండడంతో శిఖా చౌదరిని కంచికచర్ల పోలీస్ స్టేషన్ నుంచి జగ్గయ్యపేటలోని రామ్‌కో సిమెంట్స్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అలాగే ఆమెను రహస్యంగా హైదరాబాద్ కు తరలించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నది మీడియా కు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి రాకేశ్ రెడ్డి, శిఖా చౌదరి లను కలిపి విచారించాబోతున్నారు. ఈరోజు జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుదు రాకేశ్ తో పాటు మరో ముగ్గురిని మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.