అల్లుడు శీను కాంబో రిపీట్...!

SMTV Desk 2019-02-05 11:20:32  Alludu seenu movie, Bellamkonda sai sreenivas, Samantha, VV Vinayak, Ajay bupathi, RX100

హైదరాబాద్, ఫిబ్రవరి 5: మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మళ్ళీ అదే కాంబినేషన్ తో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. 2014లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల్లుడు శీను . ఈ సినిమాలో బెల్లంకొండ సాయి సరసన సమంత నటించింది. అయితే ఇదే జోడీతో RX100 డైరెక్టర్ అజయ్ భూపతి ఓ సినిమా చేయబోతున్నాడు. బెల్లంకొండ సాయి ప్రస్తుతం సీత అనే సినిమాలో నటిస్తున్నాడు. తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.





అజయ్ భూపతి ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకనిర్మాతలు సమంతతో చర్చలు జరుపుతున్నారు. అవి కొలిక్కి వచ్చిన తరువాత వచ్చే వారంలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.