'కల్కీ' యాంగ్రీ స్టార్ స్టైలిష్ టీజర్...

SMTV Desk 2019-02-04 19:22:50  Rajashekar, Kalki, Prashanth varma, Kalki movie teaser

హైదరాబాద్, ఫిబ్రవరి 4: యాంగ్రీ స్టార్ డా. రాజశేఖర్, ఆ ఫేం దర్శకుడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కల్కీ . నేడు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. రాజశేఖర్ స్టయిలీష్ యాక్షన్ సీన్ ని టీజర్ గా వదిలారు. యాంగ్రీ యంగ్ మేన్ అభిమానులని ఆకట్టుకొనేలా బర్త్ డే టీజర్ ఉంది. 1980 నేపధ్యంలో సంఘటనల ఆధారంగా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న కల్కీ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక, కల్కీ కంప్లీట్ యాక్షన్ ని మేలో చూడబోతున్నాం. ఈ సినిమాలో నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, నాజర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తోస్తున్నారు.