'బాహుబలి 2' రికార్డు బ్రేక్ చేసిన మొదటి సినిమా....!

SMTV Desk 2019-02-04 19:12:49  URI The Surgical strike, Bahubali 2, Record Break

ముంభై, ఫిబ్రవరి 4: ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకొని రికార్డుల మోత మోగించిన తెలుగు సినిమా బాహుబలి 2 . ఈ సినిమా రికార్డులను ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఆ సినిమా కలెక్షన్స్ మొదటి 30 రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఇప్పటివరకు బాహుబలి 2 రికార్డ్స్ ని ఏ సినిమా బ్రేక్ చేయని ఓక రికార్డ్ ను యూరి సినిమా బాధేసింది. బాహుబలి విడుదలైన 20 రోజుల అనంతరం కూడా కలెక్షన్స్ 8 కోట్లకు తగ్గలేదు. అయితే 23వ రోజు(6.35కోట్లు) అలాగే 24వ రోజులో(6.53కోట్లు) అందుకున్న కలెక్షన్స్ ని యూరి:ద సర్జికల్ స్ట్రైక్ బీట్ చేసింది.

ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయ్యింది. అయితే 23వ రోజు 7.80కోట్లు, 24వ రోజు 8.71కోట్లను అందుకున్న యూరి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత లెట్ గా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలు లేవు. యూరి కంటెంట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కలెక్షన్స్ 200 కోట్ల మార్క్ కి దగ్గరగా ఉంది. ఈ ఏడాది మొదటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిట్ గా యూరి నిలిచింది.