రోజు రోజుకి తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2019-02-04 17:55:35  Petrol, Diesel

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: గడిచిన కొన్నిరోజుల కింద పెట్రోల్ ధరలు తారస్థాయికి చేరాయి. అయితే ఐదో రోజూలుగా వరుసగా తగ్గుతూ వచ్చాయి. సోమవారం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్‌పై పది పైసలు తగ్గింది. ఇది ఇలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడం గమనార్హం. దేశ రాజధానిలో సోమవారం లీటరు పెట్రోలు ధర రూ. 70.59గా నమోదు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.65.61గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.76.22, రూ.68.70గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో పెట్రోలు ధరలు రూ.75 దిగువకు చేరుకుని రూ.74.89గా నమోదు కాగా, డిజిల్ ధర రూ. 71.33కి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 74.69, రూ.70.73గా ఉన్నాయి.