'అవెంజేర్స్ ఎండ్ గేమ్' న్యూ టీజర్...

SMTV Desk 2019-02-04 11:01:05  Avengers, Avengers age of ultran, Avengers Infinity war, Avengers End game, Teaser, Anthony Russo, Joe Russo, Kevin Feige, Robert Downey Jr., Chris Hemsworth, Mark Ruffalo, Chris Evans, Scarlett Johansson, Benedict Cumberbatch, Don Cheadle, Tom Holland

ఫిబ్రవరి 4: హాలీవుడ్ లో మార్వేల్ కామిక్స్ అంటే తెలియని వారు ఈ ప్రప్రాంచంలోనే ఉండరు. ఈ కామిక్స్ నుండి వచ్చిన సినిమాలు అన్ని ఎప్పటికీ గుర్తుండి పోయేవే. ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్, ప్రముఖ హాలీవుడ్ రచయిత, ఎడిటర్, పబ్లిషర్ స్టాన్ లీ వీటిని హాలీవుడ్ కి పరిచయం చేశాడు. అయితే ఈ కామిక్స్ నుండి 2012 లో వచ్చిన అవెంజేర్స్ సినిమా ఊహించని వసూళ్లు తెచ్చిపెట్టింది. కాగా 2015 ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అవెంజేర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే 2018 లో ఆ సినిమాకు మరో సీక్వెల్ గా వచ్చిన అవెంజేర్స్ ఇన్ఫినిటీ వార్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ మరో సీక్వెల్ గా అవెంజేర్స్ ఎండ్ గేమ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీక్వెల్ సినిమాలు అన్నీ దాదాపు భారీ బడ్జెట్ తో నిర్మించినవే.

అలాగే ఇప్పుడు వస్తున్న సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా నుండి ఇదివరకే ఓ టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. దానికి కూడా మంచి రేస్పోన్స్ వచ్చింది. అయితే తాజాగా 30 సెకండ్ల నిడివి గల మరో టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు అన్తోనీ రుస్సో, జో రుస్సోలు దర్శకత్వం వహించగా కెవిన్ ఫైగ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. Robert Downey Jr.,Chris Hemsworth,Mark Ruffalo,Chris Evans,Scarlett Johansson,Benedict Cumberbatch,Don Cheadle,Tom Holland,Chadwick Boseman,Paul Bettany,Elizabeth Olsen,Anthony Mackie,Sebastian Stan,Letitia Wright,Dave Bautista,Zoe Saldana,Josh Brolin,Chris Pratt,Jeremy Renner,Evangeline Lilly,Jon Favreau,Paul Rudd,Brie Larson తదితరులు నటిస్తున ఈ సినిమాకు అలెన్ సిల్వెస్ట్రి సంగీతం అందిస్తున్నారు.