'జెర్సీ' పని పూర్తయింది....

SMTV Desk 2019-02-03 19:38:30  Nani, Jersey movie, Gowtam, Natural star nani, Mallirava Fame director gowtam, Anirudh

హైదరాబాద్, ఫిబ్రవరి 3: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైయ్యాయి. కెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నాని కొంతకాలం పాటు క్రికెట్ ఆటలో శిక్షణ కూడా తీసుకొన్నారు. ఇందులో నాని మూడు ఢిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నాడు.

ఇక, నాని తదుపరి సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో నాని సరసన వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ జతకట్టబోతున్నట్టు సమాచారం. సోషల్ మెసేజ్ తో కూడిన కథతో నాని సినిమా ఉండబోతుందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.