బర్త్ డే రోజు గిఫ్ట్ గా మూవీ టీజర్

SMTV Desk 2019-02-03 19:33:36  Rajashekar, Kalki, Prashanth varma, Kalki movie teaser

హైదరాబాద్, ఫిబ్రవరి 3: యాంగ్రీ స్టార్ రాజశేకర్ హీరోగా అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్సకత్వంలో వస్తున్న సినిమా కల్కి . ఈ సినిమాను శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సినిమా గురించి విడుదల తర్వాత మాట్లాడుతా. గరుడవేగ సమయంలోనూ సినిమా విడుదల తర్వాత మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు అంతే. గరుడవేగ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించాం. అప్పుడే ఈ కథ ఓకే చేశాం. తర్వాత ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశాం. గరుడవేగకి ప్రవీణ్ సత్తారుతో పని చేసినప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో కల్కి కి ప్రశాంత్ వర్మతో పని చేసేటప్పుడు అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా.

చాలా రోజుల విరామం తర్వాత సి.కళ్యాణ్ గారి సంస్థలో నేను నటిస్తున్న చిత్రమిది. నాకు ప్రమోషన్ వచ్చినట్టు భావిస్తున్నా. కళ్యాణ్‌ గారు విషయం లేకపోతే సినిమా చేయరు. కథ నచ్చడమే సినిమా విజయంలో ఓ మెట్టు ఎక్కినట్టు. పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ చేస్తున్నాం. లోకంలో పని దొరకడం చాలా కష్టం.. నాకు పని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. జీవితం అన్నది చాలా తక్కువ రోజులు. అంతా సంతోషంగా అందరితో మంచిగా జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ తదితరులు పాల్గొన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు, డి.ఎస్.రావు, సతీష్(బంటి) ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.