'నేను నా అవినీతి'....నాగబాబు స్కిట్

SMTV Desk 2019-02-03 18:57:57  Nagababu, YouTube channel, Nenu na avineeti, skit

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా సంచలనాలు సృష్టిస్తున్నాడు. అంతేకాక తాజాగా స్పెషల్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని రాజకీయాలపై సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ స్కిట్ చేసి ఆ వీడియోను వదిలారు. ఆ వీడియోలో అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ నేను నా అవినీతి అనే కామెడీ స్కిట్ ని విడుదల చేశారు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకి పేరు పెట్టకుండా స్కిట్ చూసిన తరువాత మీరే పేరు పెట్టాలని నాగబాబు ప్రేక్షకులకు చెప్పారు.

ముందుగా ఈ స్కిట్ లో అధికారం పక్ష నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి నేను నా అవినీతి అనే టాపిక్ ఇచ్చి నాగబాబు వారిద్దరికీ పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష రాబోయే ఎన్నికల్లో చాలా కీలకమని, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ నాగబాబు చెప్పడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు పోటీ పడి మరీ పరీక్ష రాయడం, అడిషన్ల కోసం గొడవ పడడం ఇందులో చూపించారు. నాగబాబు జడ్జిగా వ్యవహరించే జబర్దస్త్ రేంజ్ లో ఈ స్కిట్ లో కామెడీ మాత్రం పండించలేకపోయినా అతడు అనుకున్నట్లుగా రాజకీయపార్టీలపై విమర్శలు గుప్పించేలా ఉంది.