1100 ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి : కేసీఆర్

SMTV Desk 2019-02-03 18:27:07  Telangana CM, KCR, Yadari temple, Development

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు యాదాద్రి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకొన్నారు. యాదాద్రి వద్ద ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం యాదాద్రి పనుల్లో మరింత వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సుమారు 1100 ఎకరాల్లో టెంపుల్ సిటీని అభివృద్ధిని చేస్తామన్నారు. ఈ టెంపులో సిటీలో 354 క్వార్టర్స్‌ నిర్మించనున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి పనుల కోసం 173 ఎకరాల భూమిని సేకరించినట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ఇవాళే మరో రూ 70 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు.

ప్రతి వారాంతంలో యాదగిరిగుట్టకు సుమారు 70 వేల మంది భక్తులు వస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఆలయం లోపల పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. సుమారు 1100 ఎకరాల్లో టెంపుల్ సిటీని అభివృద్ధిని చేస్తామన్నారు. ఈ టెంపులో సిటీలో 354 క్వార్టర్స్‌ నిర్మించనున్నట్టు తెలిపారు. నిత్యాన్నదానం కోసం దాతలు కూడ ముందుకు వస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలోనే చినజీయర్ స్వామితో తాను యాదాద్రికి వస్తానని చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారంగానే ఆలయ పునర్నిర్మాణం పనులను చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జూన్ మాసం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తాయని చెప్పారు. బస్టాండ్, క్యూ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.యాదాద్రి వద్ద ఆరు లైన్ల రింగు రోడ్డుకు కూడ నిధులను మంజూరు చేసినట్టు కేసీఆర్ చెప్పారు.