ప్రియదర్శి 'మల్లేశం' ఫస్ట్ లుక్

SMTV Desk 2019-02-03 18:03:57  Mallesham movie, Priyadarshi, Suresh productions, Raj R

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రియదర్శి అనే పేరు ప్రస్తుతం టాలీవుడ్ ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కేవలం ఒక్క పెళ్లిచూపులు సినిమాతోనే మరిచిపోలేని గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు. అయితే ఇప్పుడు ఓ పక్క కమెడియన్ గా రాణిస్తూనే తాజాగా హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అగ్ర నిర్మాత సురేష్ బాబు.. కొంతకాలం గా సినిమాల జోరు తగ్గించాడు. ఒకవేళ చేసిన కానీ చిన్న సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. పెళ్ళిచూపులు .. మెంటల్ మదిలో .. కేరాఫ్ కంచరపాలెం లాంటి లో బడ్జెట్ సినిమాలు నిర్మించి చక్కటి లాభాలు అందుకున్నాడు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో మల్లేశం పేరిట ఓ చిన్న సినిమా తెరకెక్కించారు.

చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. పేద కుటుంబం లో జన్మించిన మల్లేశం తన తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రాన్ని ఎలా తయారు చేయగలిగాడు అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.