జయరాం హత్యకేసులో ఊహించని ట్విస్ట్లు

SMTV Desk 2019-02-03 17:55:48  NRI Jayaram, Express TV Chairman, Murder Case, Mystery, Chigurupati jayaram, Shikha chaudary

విజయవాడ, ఫిబ్రవరి 3: ప్రముఖ పారిశ్రామిఖవేత్త చిగిరుపాటి జయరాం హత్యాకేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఈ కేసునుండి గంటగంటకొక వార్త బయటకు వస్తుంది. అయితే ఈ హత్యా కేసులు కీలకమైన జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. శిఖా చౌదరికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరి భర్తలతో కూడ ఆమె విడాకులు తీసుకొంది. రెండో భర్తతో విడాకులకు రాకేష్ రెడ్డి కారణమని శిఖా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని భావించినట్టు చెప్పారు. అదే సమయంలోనే రాకేష్ రెడ్డితో తాను డేటింగ్ చేసినట్టు శిఖా చౌదరి చెప్పారు. జయరామ్‌ వల్ల తాను రాకేష్ రెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడించినట్టు ఆ ఛానెల్ ప్రసారం చేసింది. రాకేష్ రెడ్డిని జయరామ్‌కు తానే పరిచయం చేసినట్టు చెప్పారు. తనతో పాటు తన చెల్లిని కూడ జయరామ్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని శిఖా చౌదరి పోలీసులకు చెప్పినట్టు చెప్పారని ఆ ఛానెల్ ప్రసారం ప్రసారం చేసింది. తనతో శారీరక సుఖం కోసం కోరుకొనేవాడినని చెప్పారు. అయితే జయరామ్ తో తాను సన్నిహితంగా మెలిగినట్టు చెప్పారు. ఈ విషయాన్ని రాకేష్ రెడ్డి గమనించి జయరామ్‌తో గొడవ పడినట్టు శిఖా చౌదరి చెప్పినట్టు సమాచారం. తన చెల్లికి కూడ మెడికల్ కాలేజీ సీటును మామయ్య ఇప్పించాడని చెప్పారు. ఈ వేధింపులు తట్టుకోలేక చెల్లి దూరంగా వెళ్లిపోయిందని తెలిపారు. రాకేష్ రెడ్డి నుండి జయరామ్ నాలుగున్నర కోట్లను అప్పుగా తీసుకొన్నాడని శిఖా చౌదరి చెబుతున్నారు.

తన కంపెనీలకు సంబంధించి చెక్ పవర్ జయరామ్ భార్య పద్మశ్రీ పేరు మీద ఉంది. దీంతో జయరామ్ అప్పులు చేశారని శిఖా పోలీసులకు చెప్పినట్టు ఆ మీడియా కథనాన్ని ప్రసారం చేసింది. మరో వైపు ఈ డబ్బులు జయరామ్ ఇవ్వకపోవడం మరో వైపు తాను దూరం కావడంతో రాకేష్ కక్ష పెంచుకొన్నాడనే అభిప్రాయాన్ని శిఖా పోలీసులకు చెప్పిట్టు సమాచారం. ఇదిలా ఉంటే మూడు మాసాలుగా తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టుగా శిఖా పోలీసులకు చెప్పినట్టు ఆ ఛానెల్ ప్రసారం చేసింది. జయరామ్ హత్య జరిగిన రోజున తాను శ్రీకాంత్‌తో కలిసి వికారాబాద్‌కు లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్టు శిఖా చౌదరి పోలీసులకు వివరించినట్టు సమాచారం. హత్య జరిగిన మరునాడు మా అమ్మ ఫోన్ చేస్తే కానీ కూడ జయరామ్ హత్య జరిగిన విషయం తనకు తెలియదని శిఖా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే తాను జయరామ్ ఇంటికి శ్రీకాంత్ తో కలిసి వెళ్లి తన పేరిట విజయవాడకు సమీపంలో జయరామ్ రాసిన భూమి డాక్యుమెంట్లను తీసుకొనేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. జయరామ్‌ను రాకేష్ చంపుతాడనుకోలేదని శిఖా చౌదరి పోలీసులకు వివరించినట్టు ఆ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డితో పాటు ఇద్దరు యువకులు, మరో మహిళలను కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్నారు.