మాది పెళ్లి కాదు ఓ కలయిక మాత్రమె...!

SMTV Desk 2019-02-03 17:27:40  Sarat babu, Ramaprabha, sarat babu sensational comments Rama prabha, Media Interview

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రముఖ తెలుగు సినీ నటుడు శరత్ బాబు, నటి రమాప్రభను పెళ్లి చేసుకుని దాదాపు ఏడేళ్ల పాటు జీవనం సాగించని తరువాత వీళ్ళిద్దరూ విడిపోయారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు రామా ప్రభ శరత్ పై అనేక కామెంట్స్ చేసేది. కాని శరత్ బాబు ఎప్పుడూ ఈ కామెంట్స్ పై నోరు తెరవలేదు. కాగా ఎట్టకేలకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామప్రభాపై శరత్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పిన శరత్ బాబు అది పెళ్లి కాదని ఓ కలయిక మాత్రమేనని చెప్పాడు.

జీవితంలో తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలన ఏం కోల్పోయానో అర్ధమైందని, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదని అన్నారు. తాను రమాప్రభని మోసం చేశానని, ఆస్తులను కాజేశానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శరత్ బాబు చెప్పారు. తన పేరుపై ఉన్న ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో రమాప్రభ, ఆమె సోదరుడి పేర్లపై ఆస్తులను కొన్నానని, వాటి విలువ ఇప్పుడు దాదాపు రూ.60 కోట్లని తెలిపారు. వీటితో పాటు చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్ లో మరొక ఆస్తిని కొనిచ్చానని, దాని విలువ కూడా కొట్లలో ఉంటుందని కావాలంటే చెక్ చేసుకోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.