నేడు పోప్‌ ఫ్రాన్సిస్‌ దుబాయ్‌ పర్యటన

SMTV Desk 2019-02-03 16:47:33  Pop Francis, Shaik Mahammad bin Jayed Al Nehyan, Interfaith Conference

దుబాయ్, ఫిబ్రవరి 3: పోప్‌ ఫ్రాన్సిస్‌ క్రైస్తవ మత గురువు నేడు పోప్‌ చారిత్రక పర్యటనకు బయల్దేరానున్నారు. దుబాయ్‌లో జరగనున్న ఇంటర్‌ఫెయిత్‌ కాన్ఫరెన్స్‌ కు ఆయన హాజరు కానున్నారు. అబుదాబీ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నెహ్యాన్‌ ఈ సదస్సుకు హాజరుకావాలని కోరారు. ఆయన ఇప్పటికే వాటికస్‌ సిటీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. ఈ సదస్సు మంగళవారం జరగనుంది. దాదాపు లక్షా 20 వేల మంది ఈ సదస్సుకు హాజరౌతారని అంచనా.

సోదరభావం, సహనశీలతలకు నిదర్శనంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ సంస్కృతులు కలిసే ప్రదేశం అని పోప్‌ దుబాయ్‌కు కితాబిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా పోప్‌ కైరోకు చెందిన అల్‌-అజ్మర్‌ మసీదు ఇమామ్‌తో కూడా భేటీ కానున్నారు.

పోప్‌ యెమన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఇప్పటికే చాలా ఖండించారు. ఈ యుద్ధంలో భాగంగా సౌదీతోపాటు యూఏఈ కూడా యెమన్‌పై దాడులు నిర్వహిస్తోంది. గత ఏడాది పోప్‌ మాట్లాడుతూ యెమన్‌లో మానవీయత దిగజారకుండా కాపాడుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పోప్‌కి ఇంత ప్రధాన్యం. యుఏఈలో దాదాపు 10 లక్షల మంది రోమన్‌ కేథలిక్‌లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది భారత్‌, ఫిలిప్పన్స్‌ నుంచి వచ్చినారే.