రూ.38 కోట్లతో ఇల్లు నిర్మించుకుంటున్న మెగా హీరో

SMTV Desk 2019-02-03 16:25:39  Ram charan, Hyderabad, Jublli hills, New house

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్ల్స్ లో భారీ ఖర్చుతో మరో ఇంటిని నిర్మిస్తున్నాడట. ఈ ఇంటి విలువ దాదాపు రూ.38 కోట్లని తెలుస్తోంది. ఇంట్లో ప్రతీ వస్తువు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ కి ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ చేసిన సర్వే ప్రకారం.. రామ్ చరణ్ ఆస్తి విలువ రూ.1300 కోట్లకు పైగానే అని సర్వేలో తేలింది. సౌత్ ఇండియాలో ఉన్న సెలబ్రిటీలలో చరణ్ నిర్మించిన ఈ ఇల్లు అత్యంత ఖరీదైన ఇల్లుగా చెబుతున్నారు.




నటనతో పాటు చరణ్ పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఉపాసనని వివాహం చేసుకున్న తరువాత అపోలో హాస్పిటల్స్ లో స్టేక్ హోల్డర్ గా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని సమాచారం.