సుకుమార్ తో నాగ శౌర్య...?

SMTV Desk 2019-02-03 13:38:18  Director Sukumar, Naga shourya, North star entertainments, Kashi vishaal

హైదరాబాద్, ఫిబ్రవరి 3: విభిన్న చిత్రాలతో మంచి ఆదరణ పొందిన యువ హీరో నాగ శౌర్యకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.