ఆలస్యం కానున్న పవన్ మూవీ..!

SMTV Desk 2017-08-01 17:38:45  PAWAN KALYAAN, TRIVIKAM MOVIE,

హైదరాబాద్, ఆగష్టు 1 : త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించగా మిగిలిన భాగాన్ని చిత్రీకరించవలసి వుంది. అయితే ఈ చిత్రం తర్వాత పవన్ మైత్రీ మూవీస్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. కాని ఆ ప్రాజెక్ట్ మొదలు కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఎందుకనగా పవన్ ఎక్కువ సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తానని ప్రకటించడమే కారణం. ఇప్పటి వరకు పవన్ సినిమాలు, రాజకీయాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. కాని సినిమాలు చేస్తోన్న సమయంలో కొన్ని సామాజిక సమస్యలపై వెంటనే స్పందించ లేకపోవడంతో వ్యతిరేక వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ ప్రకటించారు. దీంతో మైత్రీ మూవీ బ్యానర్ సినిమా మరింత ఆలస్యం అవుతుందనేది స్పష్టమవుతోంది.