ఓ పక్క తల్లి మరణం, మరోపక్క గెలుపు ఓటమిల మ్యాచ్

SMTV Desk 2019-02-03 12:21:48  Alzarri joseph, West indies cricket team, West indies VS England, Test match

అంటిగ్వా, ఫిబ్రవరి 3: వెస్టిండీస్ యువ క్రికెటర్ అల్జరీ జోసెఫ్ తన తల్లి మరణం వార్త తెలుసుకొని కూడా మైదానంలోకి అడుగుపెట్టి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ బౌలింగ్ చేసి తర్వాతి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ లోనూ మెప్పించాడు ఈ యువ క్రికెటర్. ఇంగ్లాండ్‌, విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగా జరుగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల ఆట పూర్తయ్యాక రాత్రి సమయంలో తన తల్లి చనిపోయిందని జోసెఫ్‌కి సమాచారం అందింది.

మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఉబికి వస్తోన్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ మైదానంలో అడుగుపెట్టిన జోసెఫ్ వార్మప్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. మూడో రోజు బ్యాటింగ్‌కు దిగి పరవాలేదనిపించాడు. తొలి టెస్టులో 381 పరుగుల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్.. రెండో టెస్టులోనూ 10 వికెట్ల ఆధిక్యంతో గెలుపొంది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో జోసెఫ్ 5 వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్ తల్లి మరణం పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.