ఐదో వన్డేలో కివీస్ కు 253 విజయ లక్ష్యం : కీలక వికెట్లు కోల్పోయినా నిలకడగా ఆడిన టీం ఇండియా

SMTV Desk 2019-02-03 11:50:23  India VS Newzeland, 5th ODI, Ambati rayudu, Hardik pandya, Vijay shankar

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 3: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు వెల్లింగ్టన్ వేదికగా చివరి వన్డే జరుగుతుంది. నాలుగో వన్డేలో ఘోరంగా పరజయపాలైన టీం ఇండియా ఈ మ్యాచ్ లో కివీస్ పై విజృంభించింది.18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, చివర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. రాయుడు 113 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి.

ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. రాయుడుతో కలిసి ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించి టీమ్‌ను ఆదుకున్నాడు విజయ్ శంకర్. ఆ తర్వాత కేదార్ జాదవ్ (34)తో కలిసి ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు రాయుడు. వన్డేల్లో మరో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో 90 పరుగుల దగ్గర ఓ భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. అతడు ఔటైన తర్వాత పాండ్యా మెరుపులు మెరిపించాడు.