'హుషారు'గా 50 రోజులు పూర్తి

SMTV Desk 2019-02-02 19:01:43  Husharu movie, Rahul ramakrishna, 50DAYS, Director Sree Harsha Konuganti, Medishetti Abhinav, Hemal Ingle, Tejus Kancharla, Daksha Nagarkar, Ramya Pasupileti, Priya Vadlamani

హైదరాబాద్, ఫిబ్రవరి 2: చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం హుషారు ఈ ఏడాది స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చూస్తుండగానే ఈ సినిమా విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకోవడం గమనార్హం. స్టార్ సినిమాలే ఈ రోజుల్లో అర్ద సెంచరీ సాధించడం అంటే చాలా కష్టం. అలాంటిది రెండంకెల థియేటర్స్ లో సినిమా ఆఫ్ సెంచరీ కొట్టేసింది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.

సినిమాలో ఉండిపోరాదే సాంగ్ యువతను ఎక్కువగా ఆకర్షించింది. కమెడియన్ రాహుల్ రామ కృష్ణ తప్పితే అందరూ కొత్తవాళ్లే అయినా సినిమాలో కంటెంట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. శ్రీ హర్ష అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల షూటింగ్ పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది. మొత్తానికి రిలీజ్ అయ్యి ఎంతో కొంత లాభాల్ని అందించింది.అదే విధంగా తెలుగు తమిళ్ లో కూడా సినిమా రీమేక్ కానుంది.