చెరిగిపోయిన నిఖిల్ 'ముద్ర'

SMTV Desk 2019-02-02 18:47:59  Nikhil, Mudra movie, Lavanya Tripati, TN Santhosh Director, Natti kumar

హైదరాబాద్, ఫిబ్రవరి 1: నిఖిల్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ముద్ర . అయితే ఈ టైటిల్ పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నిఖిల్ ముద్ర సినిమా సెట్స్ ఉండగానే అదే టైటిల్ తో నిర్మాత నట్టికుమార్ సినిమా తీసుకొచ్చాడు. ఈ టైటిల్ విషయంలో నిఖిల్, నట్టికుమార్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగా ఈ వ్యవహారం టీవీ ఛాలెల్స్ లో డిబేట్ వరకు వెళ్లింది. ఫైనల్ గా నిఖిల్ తన సినిమా టైటిల్ ని మార్చేందుకు రెడీ అయ్యాడు.

తాజాగా, అంతా అయిపోయింది. టైటిల్ మారుస్తున్నాం. మరో టైటిల్ చెప్పండని నిఖిల్ ట్విట్ చేశారు. అంతేకాదు నన్ను ద్వేషించిన వ్యక్తి పట్ల మరింత ప్రేమ అంటూ మరోసారి నిర్మాత నట్టికుమార్ ని గెలికే ప్రయత్నం చేశారు నిఖిల్. మొత్తానికి నిఖిల్ ముద్ర చెరిగిపోయింది. ఆ స్థానంలో కొత్త టైటిల్ రాబోతుంది. అదేంటన్నది త్వరలోనే తెలియనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత నిఖిల్ శ్వాస సినిమా చేయబోతున్నాడు.