కమిట్మెంట్స్ వల్ల ఎం చేయలేని పరిస్తితి...

SMTV Desk 2019-02-02 18:17:27  Nani, Jersey movie, Gowtam, Natural star nani, Mallirava Fame director gowtam, Vikram, Mohan krishna indaraganti

హైదరాబాద్, ఫిబ్రవరి 2: వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం తో వొక్కసారిగా తడబడ్డాడు. ఆ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని పెద్దగా ఆడలేదు. కాగా ఈ సంవత్సరం వరసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు నాని. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత, విక్రమ్ కుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అశ్విని దత్ నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంచితే, విక్రమ్ కుమార్ తరువాత నాని నిర్మాత మంజులకు సినిమా చేయాల్సి ఉంది. అటు తనను అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ప్రమోట్ చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంది. ఇలా నాని కి వరసగా కమిట్మెంట్స్ ఉండటంతో వీటన్నింటిని నాని ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.