ఇక్కడ ఇండస్ట్రీ హిట్టు...అక్కడ అట్టర్ ఫ్లాప్

SMTV Desk 2019-02-02 18:08:43  Attarintiki daredi, Vantha Rajavathaan Varuven, Pawan kalyan, Samanta, Silambarasan Megha Akash Catherine Tresa Prabhu, Sundar C

చెన్నై, ఫిబ్రవరి 2: తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అత్తారింటికి దారేది సినిమాను తమిళంలో వందా రాజాదా వ‌రువేన్ అనే టైటిల్ తో శింబు రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఈ రోజు విడుదల కాగా ఊహించని విధంగా బెడిసికొట్టింది. తెలుగులో పవన్ కళ్యాణ్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడంతో శింబు భారీ ఆశలు పెట్టుకొని తమిళ్ లో రిమేక్ చేశాడు. అది కాస్త సీన్ రివెర్స్ అయ్యింది. అయితే తమిళ్ లో ఆ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో 2.0 నిర్మాణసంస్థ లైకా *వందా రాజాదా వ‌రువేన్* గా తెరకెక్కించింది.

ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచి ఊహించని విధంగా టాక్ వస్తోంది. శింబు ఓవరాక్షన్ చేసి సినిమా ఫెయిల్యూర్ లో కీ రోల్ పోషించడాని పబ్లిక్ మైకుల ముందు గట్టిగా చెప్పేస్తున్నారు. సినిమాలో పెద్దగా మార్పులు లేకుండా సుందర్ సి త్రివిక్రమ్ స్టైల్ ని ఫాలో అయ్యాడు. కానీ ఆ టచ్ రీమేక్ లో తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. తెలుగులో పవన్ స్టామినా - త్రివిక్రమ్ టేకింగ్ కి తగ్గట్టుగా కోలీవుడ్ టీమ్ తీయలేకపోయిందని రివ్యూలు వస్తున్నాయి. ఆత్తగా నటించిన రమ్యకృష్ణ క్రేజ్ కూడా సినిమాకు ఉపయోగపడేలా లేదు. 1 నుంచి 2.5 మధ్యలో రివ్యూలు వస్తుండడంతో సినిమా రిజల్ట్ తేడా కొట్టేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.