వివాదాల్లో బిత్తిరి సత్తి

SMTV Desk 2019-02-02 17:55:47  Bittiri satti, Comedian, News channel, Srimukhi, TV Anchor

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రముఖ టీవీ ఛానల్ హాస్యనటుడు బిత్తిరిసత్తి వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా టీవీ యాంకర్ శ్రీముఖిపై చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాలకు దారి తీస్తున్నాయి. మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధిక్సుచి అనే సినిమా ఆడియో లాంచ్ వేడుకలో శ్రీ ముఖి యాంకర్ గా ఉండగా బిత్తిరి సత్తి స్టేజ్ మీదకు వచ్చి సంప్రదాయంగా డ్రెస్ వేసుకోవాలని స్టేజ్ పైనే మాట్లాడాడు. దీనితో శ్రీ ముఖి డ్రెస్ తీరుపై సత్తి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటం కరెక్ట్ కాదని స్త్రీల డ్రెస్ తీరుపై వారు మాట్లాడాల్సిన అవసరం వారికి లేదని అంటున్నారు.

అదే విధంగా షోలలో ఈవెంట్స్ లలో బూతులు మాట్లాడితేనే కామెడీ పండుతుందా అని పలువురు మహిళలు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా మహిళలను చిన్నచూపు చూడటమే అంటూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాట్లాడారు. అయితే ఈ విషయంపై ఇంకా బిత్తిరిసత్తి స్పందించాల్సి ఉంది.