కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆషా పటేల్ రాజీనామా

SMTV Desk 2019-02-02 16:42:17  Aasha Patel, Rajendra Thivari, MLA, Congress

గాంధీ నగర్, ఫిబ్రవరి 2: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి చేదు కబురు ఎదురైంది. కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆషా పటేల్ ఉంఝా నియోజకవర్గపు ఎంఎల్ఏ. ఆషా పటేల్ శనివారంనాడు పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర తివారీకి అందజేశారు.

అయితే, ఆషా పటేల్ రాజీనామాకు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. ఆషా పటేల్ 2017 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏడుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న నారాయణన్ పటేల్‌ను వోడించారు.