ఉత్తరకొరియాకు ఘాటుగా సమాధానం చెప్పిన ట్రంప్

SMTV Desk 2017-08-01 16:13:34  amerika president tramp, white house, utharakoriya, chaina, kim jan un

వాషింగ్టన్, ఆగస్టు 1 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ... ఉత్తరకొరియాను నియంత్రించే శక్తి సామర్థ్యాలు తమ దగ్గరున్నాయని ఘాటుగా సమాధానం చెప్పారు. అందుకు తగ్గ ప్రణాళికలను మాత్రం వివరించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. కాగా, గత నెలలో ఉత్తరకొరియా రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ రెండు పరీక్షలు విజయవంతమయ్యాయని, అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగల శక్తి తమకు వచ్చిందని ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన నేపథ్యంలో, ట్విట్టర్ ద్వారా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఉత్తరకొరియాను నియంత్రించేందుకు చైనా ఏమాత్రం సాయం చేయలేదన్నారు.