రాహుల్ పై ద్రవిడ్ ఆశలు

SMTV Desk 2019-02-02 15:19:03  Rahul dravid, KL Rahul, Team india, Team A

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: ఈ మధ్యే వివాదాల్లో నుండి బయటపడ్డ భారత యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ పై భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రాహుల్ భారత్- ఎ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఆ జట్టుకి కోచ్ గా భాద్యతలు నిర్వహిస్తున్న రాహుల్ ద్రవిడ్ రాహుల్ ఆట తీరుపై స్పందిస్తూ ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్న అతడు తిరిగి సత్తాచాటడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడి క్రికెట్ కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుందని అందులో ఎలాంటి అనుమానం లేదని ద్రవిడ్ తెలిపాడు. అతడి ఫామ్ గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని ద్రవిడ్ పేర్కొన్నాడు.

రాహుల్ బ్యాటింగ్ సామర్థ్యంలో ఏమాత్రం తగ్గలేదని అన్నారు. అతి తక్కువ సమయంలోనే అతడు దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని మూడు ఫార్మాట్ల( టీ20, వన్డే,టెస్ట్)లో సెంచరీలు సాధించాడని గుర్తు చేశారు. అతడు తన అత్యుత్తమ ఆటతీరుతో మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించడం ఖాయమని ద్రవిడ్ జోస్యం చెప్పారు. కొద్దిరోజుల క్రితం కాఫీ విత్ కరణ్ షో లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హార్దిక్ పాండ్యాతో పాటు రాహుల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇటీవలే బిసిసిఐ వారి సస్పెన్షన్ ను ఎత్తేయడంతో తిరిగి రాహుల్ భారత-ఎ జట్టులో చేరాడు.