పోలీసులు తమ హద్దుల్లో ఉంటే మంచింది: హై కోర్ట్

SMTV Desk 2019-02-02 15:16:31  Kareem Nagar police, High court

హైదరాబాద్, ఫిబ్రవరి 2: కరీంనగర్ పోలీసులపై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లి దాడులు చేయడాన్ని కోర్ట్ తప్పుపట్టింది. పోలీసులకు యూనిఫాం, దానిపై నేమ్ ప్లేట్, కోడ్ ఉంటాయని అవన్నీ వదిలేసి సివిల్ డ్రెస్ లో వెళ్లి కోర్ట్ ఆదేశాలను దిక్కరించి దాడులు చేస్తున్నారని, కోర్ట్ నిభందనలకు వ్యతిరేకిస్తే పోలిసుల పై తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హై కోర్ట్ హెచ్చరించింది.

రమ్మి చట్టవిరుద్ధం కాదని హై కోర్ట్ స్పష్టం చేసిన తర్వాత కూడా పోలీసులు తన రిసార్ట్ పై దాడులు నిర్వహిస్తున్నారని పుష్పాంజలి కంట్రీ రిసార్ట్స్‌ యాజమాన్యం హై కోర్ట్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కోర్ట్ రిసార్ట్ పై దాడులు చేయరాదని ఆదేశించింది. కోర్ట్ ఆదేశాలను బేఖాతరు చెస్తూ పోలీసులు దాడులు నిర్వహించడంతో రిసార్ట్ యాజమాన్యం కోర్టు ధిక్కారం కేసు వేసింది. దీంతో హై కోర్ట్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి, తమ హద్దుల్లో ఉండవలసిందిగా హెచ్చరించింది.