'చీకటి గదిలో చితక్కొట్టుడు'...18+ ట్రైలర్

SMTV Desk 2019-02-02 13:51:14  Chikati Gadilo Chitha Kotudu, Telugu Movie, Teaser, Trailer, Director Santhosh P. Jayakumar, Adith Arun, Nikki Tamboli, Bhagyashree Mote, Mirchi Hemanth , Iruttu Arayil Murattu Kuthu

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తమిళ దర్శకుడు సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, నిక్కి టంబోలి, భాగ్యశ్రీ మోతే, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు . ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఇరుత్తు అరయిల్ మురత్తు కుత్తు కి రీమేక్ గా తీస్తున్నారు. తెలుగులో కూడా వొర్జినల్ డైరెక్టర్ సంతోష్ పి జయకుమార్ తెరకెక్కిస్తున్నారు.

టీజర్ తోనే రచ్చ చేసిన ఈ అడల్ట్ సినిమా నుంచి ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజయింది. ఇది పక్కా అడల్ట్ సినిమా అని చిత్ర యూనిట్ ముందే చెప్పేస్తోంది. పోసాని కృష్ణ మురళి - రఘుబాబు వంటి సీనియర్ కమెడియన్స్ తో పాటు తాగుబోతు రమేష్ - మిర్చి హేమంత్ వంటి నటులు కూడా సినిమాలో కీలకపాత్రలో నటించారు. త్వరలో రానున్న ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలను రేవుపుతోంది. మరి రిలీజ్ అనంతరం ఈ అడల్ట్ కామెడీ ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి.