భాధ్యతలు స్వీకరించనున్న కొత్త సర్పంచులు

SMTV Desk 2019-02-02 13:40:33  Telangana New Sarpanch to take oath, Panchayath elections, Election Commission

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణలో గ్రామా పంచాయితీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఈరోజు సర్పంచ్ లుగా ప్రమాణ స్వీకారం చేసి, భాధ్యతలను చేపట్టనున్నారు. దాంతో పాటు ఈరోజే తొలి గ్రామా పంచాయితీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో తొలి పాలక మండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో గ్రామాల్లో దానికి సంభందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో 12,680 పంచాయతీలకు సర్పంచ్ లు ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారులు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం సర్పంచ్ లు , వార్డు మెంబర్లు తమ భాధ్యతలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 12,751 పంచాయతీలు ఉండగా ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 12,680 పంచాయతీలకు, 1,13,152 మంది వార్డులకు ఎన్నిక పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.