కేంద్ర బడ్జెట్ పై పొన్నం విమర్శలు

SMTV Desk 2019-02-02 13:13:56  central government, Budget, Telangana PCC Working President, Ponnam Prabhakar, BJP, TRS

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తాజాగా కేంద్రం ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్ పై తెలంగాణ పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శలు గుప్పించారు. వోట్ల కోసం కేంద్రం తాత్కాలిక బడ్జెట్ తో ప్రజలను తమవైపు తిప్పుకోవాలనుకుంటుందని ఆరోపించారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సంప్రదాయానికి విరుద్దంగా ప్రజలని ఆకర్షించేలా ఉందన్నారు. బిజెపి వ్యాపారస్తుల పార్టీ అని మరోసారి నిరుపించుకున్నారన్నారు. టాక్స్‌ పరిధి పెంచి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పటం దారుణమన్నారు. బిజెపి పేదలకు, రైతులకు, చిన్న వ్యాపారులకు అన్యాయం చేసి, బడాబాబులకు ఐటీ తగ్గించడం ఏమిటీ అని ప్రశ్నించారు. బిజెపి అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు

కేంద్రం మా పథకాలను కాపీ కొట్టిందని కవిత, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. 15 మంది ఎంపీలున్నా ఐదేళ్లుగా విభజన హామీల అమలు జరగకున్నా టీఆర్ఎస్ ఎందుకు పార్లమెంట్‌లో నిలదీయలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్, బీజేపి తో పోత్తుపెట్టుకోవాలనే యోచనలో ఉందని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.