సిమి పై కేంద్ర సర్కార్ వేటు...

SMTV Desk 2019-02-02 11:23:16  Students Islamic Movement of India, SIMI, Central government

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశవ్యాప్తంగా గత కొద్దేల్లుగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్ర కార్యకాలపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పాటు నిషేదం విధించింది. అంతేకాక కేంద్ర హోంశాఖ ఆ సంస్థ‌ను చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైన‌ద‌ని ప్ర‌క‌టించింది. సిమి కార్య‌క‌ర్త‌లు లౌకికవాదాన్ని దెబ్బ‌తీస్తున్నార‌ని, దేశ‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కేంద్రం వెల్ల‌డించింది.

సిమిపై ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని ట్రిబ్యున‌ల్ క‌న్ఫ‌ర్మ్ చేయాల్సి ఉంటుంది. సిమికి సంబంధం ఉన్న 58 కేసుల‌ను హోంశాఖ వెల్ల‌డించింది. జాతీయ భ‌ద్ర‌త‌ను భంగ ప‌రుస్తూ సిమి కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను క‌లుషితం చేస్తున్నార‌ని హోంమినిస్ట్రీ అభిప్రాయ‌ప‌డింది.