గేట్ పరీక్షలు ప్రారంభం

SMTV Desk 2019-02-02 11:11:39  Graduate aptitude Test in Education, Telangana state, GATE, IIT, NIT, M Tech courses

హైదరాబాద్, ఫిబ్రవరి 2: నేటి నుండి 3, 9, 10 తేదీల్లో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ (గేట్) పరీక్షలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీలు సహా వివిధ జాతీయ విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

మొత్తం 24 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి దాదాపు 80 వేలకుపైగా విద్యార్థులు హాజరవుతారు. రాష్ట్రంలో కరీంనగర్, కోదాడ, కొత్తగూడెం, వరంగల్‌లో పరీక్షకేంద్రాలను ఏ ర్పాటుచేశారు. గేట్ నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాసుకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.