కేంద్రం తమ పథకాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది: కవిత

SMTV Desk 2019-02-01 17:04:58  MP Kavitha, Raithu Bandhu Scheme, Telangana KCR, Central Government

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్రం ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. ఐదు ఎకరాలలోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ. 6000 ఇస్తామని ఈరోజు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఎంపీ కవిత స్పందిస్తూ తెలంగాణ లో సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన రైతుబందు పతాకాన్ని కేంద్రం కాపీ కొట్టి రైతులకు సంవత్సరానికి రూ. 6000 ప్రకటించిందని అన్నారు. రైతుబందు ద్వారా తెలంగాణా లో రైతులకు ఏడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ. 5000ల చొప్పున ఇస్తున్నామని, కానీ కేంద్రం ఏడాదికి రూ. 6000 మాత్రమే ఇస్తుందని అది కూడా మూడు విడతల్లో ఇస్తుందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఈ పథకం మేచుకోదగ్గదే అయినప్పటికీ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ౩౩ శాతం మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ అంశాన్ని మాత్రం కేంద్రం త‌మ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌ని క‌విత అన్నారు.