ముగిసిన నందు విచారణ

SMTV Desk 2017-08-01 15:36:54  NANDU DRUGS ISSUE

హైదరాబాద్, ఆగష్టు 1 : డ్రగ్స్ విచారణలో భాగంగా ఈరోజు సినీనటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ విచారణ పూర్తైంది. డ్రగ్ దందాపై సాగుతున్న ఈ విచారణలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన విషయం తెలిసిందే. అయితే కెల్విన్ ఫోన్ లో నందు ఫోన్ నెంబర్ కూడా ఉండడంతో ఆ దిశగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. నందు ఎంత స్వేచ్ఛగా విచారణకు వచ్చాడో, అంతే స్వేచ్ఛగా విచారణ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఈ విచారణలో అతి తక్కువ సమయం విచారణను ఎదుర్కొన్న వ్యక్తిగా నందు నిలిచారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని స్పష్టం చేసారు. అసలు విచారణను ఎదుర్కొంటున్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకపోవడం విశేషం. కాగా తన భర్త నందుపై సింగర్ గీతా మాధురి పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ రోజుతో సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ నటుల విచారణ పూర్తి కాగా విచారణలో సేకరించిన వివరాలతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మొదటి దఫా విచారణ పూర్తి కాగా, ఈ విచారణలో తెలిసిన వివరాల ప్రకారం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.