అలోక్ వర్మపై కేంద్రం ఆగ్రహం, తిరిగి బాధ్యతలను స్వీకరించాలని ఆదేశం

SMTV Desk 2019-02-01 15:43:05  Alok Verma, Central Home Ministry, Fire Service Director Genaral

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా ప్రభుత్వం నియమించింది. కానీ అలోక్ వర్మ ఆ బాద్యతలు స్వికరించాకుండానే రాజీనామా చేశారు. ఇప్పుడు అలోక్ వర్మ తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అలోక్ వర్మ ఉద్యోగానికి చేసిన రాజీనామాను కూడా తిరస్కరించింది. వర్మపై విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన రాజీనామాను ఆమోదించబోమని వొక సీనియర్ మంత్రి తెలిపారు. కేంద్ర హోంశాఖ వర్మకు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తక్షణమే బాధ్యతలను స్వీకరించాలని ఆదేశిస్తూ బుధవారం లేఖ రాసింది.అయినప్పటికీ వర్మ బాధ్యతలను చేపట్టలేదు.

ఈ విషయమై వర్మ మాట్లాడుతూ, 2019 జనవరి 10న సీబీఐ డైరెక్టర్ గా తాను ఉద్యోగ విరమణ చేశానని, అధికారిక రికార్డుల ప్రకారం 1957 జూలై 14 న తాను జన్మించానని, ఆ లెక్క ప్రకారం 2017 జూలై 31నే తాను పదవీ విరమణ పొందానని చెప్పారు. ఇప్పటికే 60 ఏళ్లను పూర్తి చేసుకున్న తాను జనవరి 10 సీబీఐ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందానని తెలిపారు. దీంతో కేంద్రం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సర్వీస్ రూల్స్ ను వర్మ బేఖాతను చేశారంటూ, ఆయనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా అతని రిటైర్ మెంట్ బెనెఫిట్స్ ను కూడా నిలిపివేసింది.