బాయ్ ఫ్రెండ్ తో షూటింగ్ స్పాట్ కి...

SMTV Desk 2019-02-01 13:18:37  Lakshmi rai, Boy friend, Where is venkata lakshmi

హైదరాబాద్, ఫిబ్రవరి 1: 'ఖైదీ నెంబర్ 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి బాగానే ఫేమస్ అయిన తమిళ బ్యూటి లక్ష్మీ రాయ్. ఈ హీరోయిన్ ప్రస్తుతం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా రాయ్ లక్ష్మీతో పాటు వొక వ్యక్తి షూటింగ్ కి వచ్చేవాడట. ఆమె బంధువర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదట.

కానీ అతడితో ఆమె సాన్నిహిత్యం, బాడీ లాంగ్వేజ్ వేరుగా అనిపించడంతో విషయం ఏంటని ఆరా తీయగా, బాయ్ ఫ్రెండ్ అని తేలిందట. గతంలో కూడా రాయ్ లక్ష్మి కొంతమందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖ క్రికెటర్ పేరు కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం లేదనే చెప్పాలి.