అగ్రరాజ్యం గజగజ

SMTV Desk 2019-02-01 13:17:33  America, Snowfall

ఎముకలు కోరికేల ఉన్న చలిలో అగ్రరాజ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. అమెరికాలో ఘోరమైన మంచుతో మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకరస్థాయికి చేరింది. ఆర్కిటిక్ కంటే తక్కువకు ఊష్ణోగ్రతలు పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో మైనస్ 53 డిగ్రీలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో హిమపాతం నమోదు కావచ్చని భావిస్తున్నారు.తీవ్రమైన హిమపాతం కారణంగా రహదారులు, ఇళ్లు, చెట్లు మంచుతో కూరుకుపోయాయి. విస్కాన్సిన్ ప్రాంతంలో చలి మరింత తీవ్రంగా ఉంది. గత కొన్నేళ్లలో ఇదే అత్యంత ఘోరమైన హిమపాతమని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మంచు వల్ల దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో -50 డిగ్రీలు, ఇల్లీనాయిస్, గ్రేట్ లేక్స్, మిన్నెపోలీస్, డెట్రాయిట్, షికాగో తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. హిమపాతం కారణంగా అమెరికాలో విద్యసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అత్యవసర ఆశ్రయ కేంద్రాలను మాత్రమే ప్రభుత్వం తెరచింది. వెయ్యికి పైగా విమానాలను రద్దు చేశారు, రైళ్ళు కూడా నడవలేని పరిస్థిలో ఉన్నాయి. ఇంతవరకు మంచు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు విడిచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.