రైతుబంధు తరహాలో కొత్త పథకం: పియూష్ గోయల్

SMTV Desk 2019-02-01 12:03:25  Piyush Goyal, Rythu Bandhu Scheme, Budget meeting

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. ఈ సమవేషంలో ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం మాదిరి 2019-20 మధ్యంతర బడ్జెట్ లో చిన్న, సన్నకారు రైతులకు కొత్త పతాకాన్ని అమలు చేయనుంది.

ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద ఏడాదికి రూ. 6 వేల అందజేయనున్నారు. ఈ నగదును మూడు విడతల్లో అందజేస్తారు. ఈ పథకం వల్ల 12 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ పతాకాన్ని త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు సంతోషంగా బతకాలన్నదే తమ లక్ష్యమని, ఈ పథకం కోసం ప్రతి ఏటా రూ. 6వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు.