45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ సమస్య, తిప్పికొట్టిన నీతి అయోగ్

SMTV Desk 2019-02-01 10:40:20  Amithab Kanth, Rajiv Kumar, Rahul Gandhi, NSSO, NITI Ayog

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: జాతీయ నమూన సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్ఓ) దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది. గత 45 ఏళ్లతో పోలిస్తే 2017-18 సంవత్సరాల్లో అధికంగా నిరుద్యోగ సమస్య నమోదైందని వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ సమస్యపై తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ సమస్య ఉందనే వార్తలను నీతి అయోగ్ సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ తిప్పికొట్టారు. అసలు ఆ డేటా అధికారికం కాదని తెలిపారు. దానిని ఇంక వెరిఫై కూడా చెయ్యలేదను పేర్కొన్నారు. విడుదలైన నివేదిక డ్రాప్ట్ అని అది పూర్తి కావాల్సి ఉందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఉద్యోగాలకు సంబంధించిన డేటాను ఇంకా ప్రభుత్వం విడుదల చెయ్యలేదని, ఎందుకంటే అది ఇంక పూర్తి కాలేదని తెలిపారు. డేటా పూర్తిగా తయారయ్యాక తాము విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు సృష్టించమని తెలిపేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాజీవ్ కుమర్ చెప్పారు.

కాగా దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని రిపోర్టులు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. 2017-18లో నిరుద్యోగ రేటు 6.1 శాతమని ఎన్ఎస్ఎస్ఓ తెలిపినట్లుగా వచ్చింది. గత 45 ఏళ్లలో ఇదే గరిష్టం. నవంబర్ 2016లో ఎన్డీయే సర్కారు నోట్ల రద్దు చేశాక నిరుద్యోగ సమస్య పెరిగిందని, 1972-73 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, గ్రామీణ ప్రాంతాల (5.3 శాతం)తో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో (7.8 శాతం) నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని రిపోర్ట్ వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని బీజేపీ నేతలు కూడా కొట్టి పారేశారు. 2004-05 నుంచి 2011-12 సంవత్సరాల మధ్య చదువుకున్న గ్రామీణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగ శాతం 9.7-15.2 మధ్య ఉండగా, 2017-18లో అది 17.3 శాతానికి పెరిగిందని, గ్రామీణ పురుషుల్లో 2004-05 నుంచి 2011-12 మధ్య 3.5-4.4 శాతం మధ్యనున్న నిరుద్యోగ రేటు 2017-18లో 10.5 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు.